భానుసప్తమి
భానుసప్తమినాడు భాస్కరునర్చించు
భాగ్యంబునందితి భాగ్యవశత
జపముతపములేమిజన్నంబులేమియు
సాగించలేనట్టి జనులకైన
ప్రత్యక్షదైవాన్ని ప్రతిదిన మంతయు
దర్శించు భాగ్యంబు దక్కునెపుడు
ఉదయాద్రిపైనుంచి నుత్సాహమొసగగా
పయనించి మనకెంతొ బలమునొసగు
ఆయురారోగ్యాలనానందమందించి
కనురెప్ప వోలెను కాచునెపుడు
ఏడుగుర్రాలతో యెదురేమిలేకుండ
గగనాన పయనించు కర్మసాక్షి
ఆ.వె
అతను లేక మనకు నస్థిత్వమేముంది
పగలురాత్రులొసగు భాస్కరుండు
ఆరురుతువులిచ్చి యారోగ్యభాగ్యంబు
మనకునొసగునట్టి మంచిమనసు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి