తృప్తి

తృప్తి
ఆలు నాహరమ్ము యర్థమనెడుమూడు
తృప్తి పడుగ వలయు తృష్ణ వీడి
దానతపమలాది తగినవిద్యలందును
తనివితీరదగదు తానుయెపుడు

శ్లో𝕝𝕝 సంతోష స్త్రిషు కర్తవ్యో కళత్రే భోజనే ధనే!
త్రిషు చైవ నకర్తవ్యో దానే తపసి పాఠనే!!

తా𝕝𝕝 భార్య, భోజనం, ధనం ఈ మూడింటి విషయంలో దొరికిన దానితోనే తృప్తి పడాలి,
*దానము, తపస్సు , విద్య ఈ మూడింటి యందు మాత్రం ఎప్పటికీ తృప్తి పడరాదు*....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత