సోత్కర్షభావము
సోత్కర్ష భావమ్ముసోదితో మొదలౌను
ఊకదంపుళ్ళంత నూతమొసగు
ఆత్మకీర్తనమంత యానందమందించి
వినువారి కంతయువిసుగుతెచ్చు
మాయింటి దున్నైన మహిమోన్నతమనుచు
ఇంద్రుగజమునైన యీసడించు
నాయంతఘనులింక నవనిలోయెవరోయి
నామాటవినకున్న నరకమనను
తోటివారినెపుడుతోచుకోనీయక
డప్పుకొట్టినయట్లుగొప్పకొరు
వ్యాపార ప్రకటనల్ వర్తించు విధమింతె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి