ఆదిత్యనాథుని‌అధ్భుత పాలన

ఆదిత్యనాథునినధ్భుతపాలన
మాకులేదనుమాట నాకు తోఛె
యోగిరాజ్యమునందు యోగ్యమౌ పాలన
జనకురాజ్యమునందు జరిగినట్లు
కానవచ్చునెపుడు కౌశలమ్ముచూపును
అతనికతడెసాటి యవనిలోన
దుష్టశిక్షణ మందుశిష్టరక్షణమందు
దక్షుడనగచెల్లు ధాత్రిలోనే
జనులవద్దకతడు స్వయముగా వెళ్ళుచు
వారిబాధలనెల్ల బాపునతడు
పుణ్యతీర్థములున్న పుడమిలోనయితడు
రాజ్యమొనరజేయు రాజయోగి
ఆ.వె‌.కావివలువుకున్న కర్తవ్యదీక్షను
ఆచరించి చూపునధ్భుతమ్ము
అన్యులెవరుసాటి యాదిత్య నాథుడె
మాకువలయునోయి మరలమరల
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
సర్వ సంగ పరిత్యాగి పాలనలో  రాగద్వేషాలకు తావులేదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత