సుభాషితాలు

సత్యంబు తల్లిగా సతతంబు రక్షించు
జ్ఞానమే జనకుడై జ్ఞాని జేయి
ధర్మమే యనుజుడై  ధర్మాత్ముజేయగా
తపియించు నెప్పుడు ధరణి నిన్ను
కరుణార్ద్ర భావమే కడుమైత్రితో నిన్ను
కంటికి రెప్పలా కాచియుండు
శాంతమే.పత్నియై సహనమే పుత్రుడై
మాత్సర్య భావంపు మంటనుండి
ఆ.వే  అనవ రతము నిన్ను నాప్యాయ దృష్టితో
రక్షణంబు నొసగు రక్షరేకు
బంధు జనులు వీరు భవబంధముల నుండి
మనుజునెపుడు బ్రోవ మసలు చుంద్రు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత