నిధిసుఖమా
నిధిసుఖముకాదు నిశ్చయంబిదియంచు
నిర్భీతితెలిపిన నిపుణుడితడు
రామునిసన్నిధే రమ్యమౌనిధియంచు
భక్తితో తెలిపిన ప్రాజ్ఞుడితడు
సంగీత శాస్త్రాన్ని సాహిత్యమర్మాన్ని
శాస్త్రీయమౌరీతి సాధ్యపరిచి
శాంతము లేనిదే సౌఖ్యంబు లేదంచు
నిగమోక్తిచాటిన నీతి శాలి
ఉంఛవృత్తియెనాకు నుచితమౌవిధియంచు
ఆచరించిన యట్టి యాఢ్యుతడు
చందురూవర్ణునియందాలనన్నియు
మనసారదర్శించు మార్గ మిచ్చె
ఆ.వె.సామవేదభవము సంగీత మంతయు
భక్తిచేత నిచ్చు ముక్తి యనుచు
ఆచరించి చూపె యవనిలో మనకెల్ద
తెలుగువారు సుంత తెలుసుకొండు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి