బ్రతుకు బంగారం
బ్రతుకంత ధన్యమౌ బంగారమన్నట్లు
కనకదుర్గనుజేరి కనకమాయె
అపరంజీనీవంత యన్నపూర్ణనుజేరి
మకుటమైనావమ్మమణులతోడ
రత్నాలతోచేరి రత్నాలహారమై
జగదంబగళమున సాగినావు
కమనీయమౌరీతికరములో కమలమై
కమలాలయనుజేరి కరిగినావు
పూర్వాన పుణ్యంబు పూర్ణంబగాజేయ
సుమమాలగామారె సురులవోలె
ధన్యమౌజన్మంబు ధరలోన మీదోయి
మాటపాటలతోడ మనుటకన్న
నరులకీబాగ్యంబు నడవనేనడవదు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి