ధీరుడు మోడీ-

ధీరుడతడు మోడి ధీరత్వగరిమతో
నుగ్రవాదులనెల్ల నూదివేసె
ధీరత్వశిఖరమై వైరివర్గమునెల్ల
అభనందనీయూడై యడలజేసె
మమతాను బంధమ్ము మాత్సర్యమున్ జూపు
పలువలెల్లరకట! తులువలైరి
ధేశభక్తిరహిత దౌర్భాగ్యులెల్లరు
సొడ్డుమాటలచేత చెడ్డయైరి
ఆ.వె.మాతృదేశభక్తి మచ్చుకైననులేక
ఓట్లుకొరకు వీరు పాట్లుపడగ
సిగ్గులేని తనము చీకాకు పరచదో
ఏవగింతకన్న యేమిగలదు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత