ఫాదర్స్ డే అను తండ్రిదినము

తండ్రికోదినమంటుదానికోలెక్కంటు
తెల్లదొరలిపుడుతెలుపగానె
గొర్రెదాటుతనము గొప్పగా నున్నట్టి
ఆంగ్లమానసపుత్రులనవరతమిటుల
అనుకరించిరికాదె యర్హమనక
మాతృదేవోభవ పితృదేవోభవ యని
వేదరుషులెపుడొ వెల్లడించ
బుట్టదాఖలుసేసిబూజగాదులిపేసి
వానప్రస్థ మనుచు వారి నొదిలి
ఏటికోనాడిట్లు యేర్పాటు గా వెళ్ళి
కేకులేకోసెసికొసరికొసరి
తినిపించగలరోయి తిన్నాగమీరంత
ఆ.వె
కాల మహిమ కాదొ కాసుల కక్కుర్తొ
ఏమిచెప్పగలముయింకమనము
పుణ్యభూమి లోన పుట్టినమనమంత
మాతృభక్తితోడ మసలవలయు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత