అఖిలజగతికే ఆధారం
అఖిలజ గతికెల్లయాధార మైనావు
భూమత యైనావు భూతతతకి
జలరూపమైనావు జాలితో మామీద
దాహంబు తీర్చావు తల్లి యట్లు
వైష్ణవీ మాయతో వైరిసంఘమునంత
పరిమార్చి నావమ్మ. భద్రమొసగ
విద్యాస్వరూపివై వేదాది శాస్త్రాలు
వేద్యంబు యౌనట్లు విద్య నొసగి
ఆ.వే సకలజనుల కెల్ల సర్వశుభములిచ్చి
భుక్తి తోడ మాకు ముక్తి నివ్వ
కంకణంబు కట్టి కాపాడు తల్లివి
మాతృ రూపి యైన మమత వీవు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి