అతని పదములు
అతని పదములంటి యరలిప్త నిలిచినా
జన్మధన్యమగును జన్మ లేక
ఆపద మొక్కుల యాత్మీయబంధువు
మనసులో మొదిలినా మనకుమేలె
వైకుంఠవాసంపువైరాగ్యమొదవగా
కోనేటిరాయుడై కొలువుదీరె
గోవర్ధనమునంతకొనవేలితో నెత్తిన
గోవిందుడైనట్టి కోమలుండు
కాళీయు నెత్తిన కేళిగాలీలగా
నర్తనంబాడెటి నర్తకుండు
ఆనందనిలయుడై యానందమొనగూర్చు
పద్మావతీ నాథు పదములివియె
ఆ.వె.మ్రొకులిడగరండి మోదంబుతోమీరు
వడ్డికాసులయ్యవరములొసగు
ఎదురుచూచునట్టి యేడుకొండల సామి
కనులపండవట్లు కాంచరండి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి