డైలీసీరియల్స్
కొరివితో తలనంత గోకికోనేలమ్మ
కన్నీరు నింపగా కష్టమేల
సుఖమున్న ప్రాణాన్ని శోకాన ముంచగా
పనియేమి మీకింక పడుతులార!
విజ్ఞాన మేలేని విపరీత భావాలు
కుట్రల కోణాల కుమలనేల
వినొదమ్ము లేదోయి విలయమ్ము మొండోయి
పడతులె పడతకి పగవారుగామారు
వండివార్చినయట్టి వంటయేల
పండగ పబ్బాల పరమోత్సహంబంత
చిదిమేయు గలదోయి చిటికెలోన
ఆ.వె.ఇట్టి సీరియల్సు యిహలోక నరకాన్ని
మధ్యగదికి తెచ్చి మంట పెట్టి
ధనముదండు కొనరి దర్శకేంద్రులకట
తెలివి తెచ్చుకొండి తెప్పరిల్లి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి