స్వామీ వివేకానంద

కారణజన్ముండుకరుణాంతరంగుండు
మావివేకానంద మహితకీర్తి
వేదోక్త ధర్మాన్ని విశ్వానికందించి
మిత్రసమ్మితముగా హితముగూర్చ
అఘములే లేనట్టియమృతపుత్రులుమీరు
పాపులనుమీరు పలుక కండి
మీలోన దాగున్న నిజమైన శక్తిని
జాగృతి మొనరించ జగతిమీదె
నిగమశిఖలలోన నిక్షిప్తమైనట్టి
వేదాంతసారాన్ని విదితపరిచి
భువనేశ్వరీమాత పుణ్యాలపంటగా
జన్మించినాతడు జగతిలోన
మానవ సేవయే మాధవు పూజగా
జీవసేవయయన్న శివునిపూజయనుచు
ఆచరించి చూపిన యమృతమయుడు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
[స్వామీ వివేకానంద పుణ్యతిథి సందర్భంగముగా]

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత