లుభ్ద ద్రవ్యము

*శ్లోకం*

శునఃపుచ్ఛ మివ వ్యర్థం
లుబ్ధస్య పరిజీవనం|
నహి గుహ్యగోపాయచ
నహి దంశనివారణే||

(సుభాషితరత్నావళి)

పిసినిగొట్టు బ్రతుకు పైకంబు మొత్తము
నిరుపయోగమగుటనిజము సువ్వె
కుక్కతోక యట్లు గుప్తంబుదాచదు
మశకబాధనేమొమాన్పదాయె

*తాత్పర్యం*

లోభి యొక్క బ్రతుకు కుక్కతోకవలె నిరుపయోగమైనది సుమా! కుక్క తోక సిగ్గును దాచుటకూ పనికిరాదు, ఈగలను తోలుటకూ ఉపయోగించదు. అట్లే లోభిధనం తనకుగాని, పరులకుగాని ఉపయోగించదు.
ఎంత మంచి సామ్యము.మన దగ్గర నున్న ధనం లోభి దగ్గర నున్న ధనం లా కాకుండా చూసుకోవాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత