వెధవ

వెధవవెనుకచేర వేదనలెమిగులు
దేభ్యముఖునివెన్కద్రాబ లగుట
నైచ్యగుణముజూపు నీచుననుసరించ
బ్రతుకుకాస్తయిపుడు బండలగును
ప్రాడ్వివాకులపల్కు పరగడుపెయగును
మంచివారిహితము మంటగలపు
తనకుతెలియదాయె తనవారి మాటలు
చెవియొగ్గి విననట్టి చెనటి యాయె
ఆ.వె.ఇట్టి నేత యన్న యిడుములే యిడుములు
వలదుగాక వలదు వలదు మనకు
యోగ్యు డైన నేత యెకడెచాలుమనకు
నాగరాజు మాటనమ్ముడింక
(రచన:-- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత