గీతాసందేశము
ఆత్మవిశ్వాసంబయదియెక్కటేచాలు
కఠినమైనకార్యంబు కారుచౌక
నీలోనదాగున్న నిద్రాణమౌశక్తి
మేల్కొన్న చాలును మేరునగమె
గీతోపదేశమ్ము కోటిగొంతులతోడి
ఆత్మబలమెసగు నధిక శక్తి
బలహీన భావమే బంధించు నిన్నంత
పిరికితనమెనీకు పీడయగును
వేదాలు శాస్త్రాలు వేనోళ్ళతోతెల్పు
అభయభావమొకటె యధ్భుతమ్ము
ఆ.వె.సంతరించుకొనుము స్వాభావ్యశక్తిని
నిన్నుమించువాడునిలనులేడు
వింధ్య పర్వతమ్ము వెన్నువంచి
దారియెసగెకాదె తపసియగస్త్యుకు
భరతభూమిచూపు పథముయిదియె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి