కొలనినీరు కనులలోని వరుడు

అర్చించు వేళలో నగుపించు రూపమ్ము
భవదీయ మహిమయే మాకు తోడు
సంస్తుతి వేళలో శబ్దగత మవుదువు
నామజపమెకటె మాకు రక్ష
చైతన్య మూర్తిని చింతనంబందున
ధ్యానమే మాకింక ధ్యాస కాగా
వేదాంతం వీధిలో వెలయుచుందువు నీవు
తత్త్వంబు యరయగా తత్త్వ మసివి
ఆ.వే.విశ్వ మయత కల్గివిశ్వంబు వీక్షించు
సర్వ శక్తి మయుడు సర్వ సాక్షి
సగుణ నిర్గు ణుండు సర్వమయతనుండు
అతని కన్న నింక యన్య మేమి

(విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత