అర్ధనారీశ్వర శిల్పము-చిత్రము

అర్ధనారీశ్వరులపరూప శిల్పమ్ము(చిత్రము)
అసదృశమైనట్టి యధ్భుతమ్ము
జగతిలో నీరీతి చాతుర్య  రచనమ్ము
కన్పట్టు మనకంత కావ్యమందు
కాళిదాసుమదిని కాంచినాడేమోను
భావించి నేమోను భాగ్యమట్లు
ఆధ్యాత్మ తత్త్వమే యాధార భూతమై
సాగించినట్టిదౌ శాస్త్ర మిదియె
నందీశు పైచేయి నగజాత కలశమ్ము
అర్ధనారీశ్వర యద్వైత తత్త్వంబు
కన్నుల ముందర కాంచ గలము
ఆ.వె.పాలలోని తెలుపు భాసిల్లునట్లుగా
వెలుగులోననున్న  వేడిమట్లు
సూర్యునందు రశ్మి  సుందరతరమట్లు
అమ్మలోన కనుము నయ్యనెపుడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత