కారణజన్ముడు
కారణజన్ముండు కరుణాలవాలుండు
అద్వైత తత్త్వాన్ని యవనికిచ్చి
వేదాంత తత్త్వాన్ని విశ్వానికందించి
షణ్మతస్థాపన జరిపినారు
పంచాయతనపూజ ప్రారంభమొనరించి
సౌహార్ద్రభావాన్ని చాటినాడు
బాదరాయణుముని బ్రహ్మసూత్రములకు
భాష్యంబురచియించె భవ్యరీతి
సాలోక్యసామీప్య సారూప్య సాయుజ్య
భక్తిదశలజూపు బాట వేసె
వేదోక్త ధర్మాన్ని విశ్వానికందించ
నలుదిక్కులానిల్పె మఠములతడు
జగదంబవిభవాన్ని సౌందర్యలహరిలో
లలితమౌరీతిగా రచన సల్పె
కరుణాంతరంగుడై కమలాలయనువేడి
కనకంబుకురిపించి కరువుబాపె
దుస్సహాచార్యాలదునుమాడధరపైన
పదముమోపినయట్టిపరమశివుడు
జనని యాజ్ఞలేక సన్యాసదీక్షను
అనుచు నాజ్ఞచేసి యాచరించు
మాతృభక్తియుతుడుమహనీయడతడయ్య
ఆదిశంకరుణ్ణియనసరింతు
(రచన:--విద్వాన్ గొల్లా పిన్ని నాగరాజు శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి