నా మొదటి ద్విపద

శ్రీశైల విభుని పై చిత్తంబునిల్పి
భ్రమరాంబనెంతేని భక్తితో తలచి
విఘ్నాలు నశియింప విఘ్నేశుదలచి
కరుణించి కాపాడు కమలాప్తుడనుచు
వల్లెలాంబనువేడివరసిధ్ధిపొంది
వచియించునేనింక వాక్సుధలుకురియ
నీపాదసంసవనిధియున్నచాలు
నిధులేలసిరులేల నీభక్తికలుగ
నిరతంబునీధ్యాసనివ్వవేతల్లి
దయచూపినన్నంత దరిజేర్చుమమ్మ
మాయవైనీవున్న మాకేమిభయము
అమ్మవైనువుంటివదిచాలుమాకు
దారితప్పినసుతుదండించురీతి
దనుజమర్దనజేసిదయచూపినావు
చైతన్యమనియెడుస్తన్యంబునిచ్చి
సకలజీవులనెల్లసంతృప్తిపరచి
ఆదరింతువెపుడునమ్మాగానీవు
వరములిచ్చెడి వరలక్ష్మి యిట్లు
వరమిచ్చినా వమ్మ వలెలాంబనాకు
ఎల్లరితల్లియౌ యెలమ్మతల్లి
ఎల్లలే లేవుగా యెదలోన నీకు
-----------+--------------------------------
కథా ప్రారంభము.
కన్నడ సీమకే కంఠహారమ్ము
అల్కూరుగ్రామమ్ము నామ్నాయపథము
ద్విజబృందసేవ్యుడౌ త్రిపురారియెప్పె












కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత