గాంభీర్య కంఠీరవము

గాంభీర్యరవముతో గర్జించు సింహమా!
కనులపండువనిన్ను కాంచగానె
కనకకశిపునంత కడతేర్చునెపముతో
హరిరూపమైనాడు హరియుతానె
దుర్గమ్మ సేవలో దుష్టాత్ము దైత్యుల
పనిపట్టి ప్రఖ్యాతి పడసినావు
కంఠీరావఖ్యతో గాంభీర్యమొలకించి
అడవికేరాజువై యలరినావు
పురుషసింహమనుచుపురుషోత్తమఖ్యాతి
బిరుదుగారాముండు పొందలేదె
మృగనయలంతయుమృగరాజమధ్యమ
బిరుదుతో నీపేర పిలువలేదె
భయదసుందరమ్ము భవదీయరూపమ్ము
రాచఠీవకీవె లాంఛనమ్ము
మకుటమేమిలేని మహరాజువీవోయి
నిన్నుమించువారునిలనుగలరె
(రచన:- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజు శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత