లక్ష్మీదేవి
పాలకడలి పట్టి పట్టుపుట్టముకట్టి
భక్తనివహమంత ప్రస్తు తించ
అశ్వంబు ముందుండ నరదంబు తానెక్కి
కరులన్ని మేల్కొప బయలుదేరె
పేదరికముపై పెదెత్తు దాడికై
కదనంబుచేయగా కదిలె రథము
సరసిజాసనురాణీ సమరంబు చేయగా
దారిద్ర్య నాశమ్ము తప్పదింక
కుమద బాంధ వుండు కురిపించు వెన్నల
సుధలు కురియు నట్లు చూపె తల్లి
అమృత సదృశ మైన నానంద మందించు
దండమిడగ రండి దండిగాను
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి