కొనలేని కోర్కెలు
కొనలేని యట్టిదౌ కోరికల్ కలవోయి
కనలేవు నీవెంత కష్టపడిన
ధరయెంత పెట్టినా ధరలోన నీవింక
స్వాస్థ్యంబు కోల్పోవ స్వంత మగునె
మోదంబు తోనీవుమోహంబు పడగానె
దక్కించు కోలేవూ ధరను నీవు
ప్రేమించి నానంటు ప్రేతంబు వలెనీవు
బ్రతిమాల బ్రతుకంత భారమగును
కమ్మ నైన కలలు కలికాని కైనను
చూడ లేము మనము చూడ్కు లున్న
ఆశ పడిన నేమి యందుకో లేనట్టి
వస్తు వున్న దనుట వాస్త వమ్ము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి