ఆత్మీయమౌ యాదిత్యడు

ఆత్మీయ భావంబు నాదిత్యుడేచూపు
ఇంతకన్నమనకు హితులు లేరు
ఉర్విజనులకెల్ల నుత్తమమిత్రుండు
భానుమూర్తెమనకు బంధువయ్య
పగలురాత్రులనిచ్చి పాడిపంటలనిచ్చి
ఎండవానలనిచ్చి యేలుకొనును
వందనీయుడతడు వరమిచ్చు మనకంత
వందనప్రియిడాయె వసుధలోన
ఆరోగ్యమొనగూర్చి నాహారమందించి
నఖిలమ్ము సమకూర్చు నాప్తసఖుడు
అర్ఘ్యమర్పించ నానంద పడునట్టి
గాయత్రి మంత్రార్థ కర్మసాక్షి
ఆనంద మందించి నారోగ్య మొనగూర్చు
సూరిజనులపాలి సూర్యుడతడు
ఆ.వె. అదితి పుత్రుడతడు నానంద సంధాయి
కాశ్య పేయు డతడు జ్ఞాన దాత
సకల జనుల కతడు సన్మిత్రు డతదయ్య
వందనాలు వేల వంద నాలు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత