బ్రతుకిచ్చుబహుగొప్ప అందాలు
బ్రతుకుకు బహుగొఫ్ప బహుసొబగిచ్చేటి
మేలైన దినుసులు మీకునప్పు
అధరానికందమ్ము నచ్చమౌ నిజమోయి
కరుణాంతరంగమ్మె కజ్జలమ్మ
కంఠానికందమ్ము గాఢమౌ భక్తియే
దానమే సొబగోయి దాతచేయి
దరహాస వదనమేనరులకే యందమ్ము
ధరలోన చెల్లును ధాటిగాను
హృద్యమౌ ప్రేమయే హృదయానికి దుమ్ము
మాధుర్యమొసగేటి మంచిమనసు
ఆ.వె.
ధనము చేత నీకు దక్కదీసంపద
బాగుగానునీవు వాడుకొన్న
సౌఖ్యవంతమొసగు సౌజన్య సంపద
జన్మధన్యమగును జడతలేక
(రచన:--విద్వాన్ గొల్లా పిన్ని నాగరాజు శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి