తపన తాపములు
తపనుడనుటెగాని తాటిముంజలిచ్చి
తాపంబు హరియించు తప్పకుండ
రోహిణి కార్తెలో రోళ్ళుపగలగొట్టి
మల్లెపూలనొసగుమంచిమనసు.
చురచురాచూచినా చూతఫలములనిచ్చి
మధురమౌరుచినిచ్చి మనచుమనల
ఋణదాత యట్లు గా రొక్కించినట్టుండు
అప్పిచ్చి మననంత నాదు కొనును
తీక్ష్ణంబు గాజూచి తిమిరాన్నితానంత
తరిమేసి వెలిగించు తత్పరుండు
సృష్టిలో సర్వాన్ని సృజియించి మనకిచ్చి
మన్నించి మననిచ్చి మనలగాచు
ఆత్మబంధువతడునను దినమరుదెంఛి
మంచిచెడ్డలరయు మనసువాడు
అతనివలనకాదెనారోగ్యభాగ్యంబు
మనకుకలుగునోయి మరువకోయి
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
అప్పు = ప్రయోగం కృష్ణరాయల ది .( ఆముక్తమాల్యద)
అప్పు = నీరు(,సంస్కృతం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి