చుంబన స్వామి
చుంబన స్వామిచుంబనానందుల చూడగా చీచీల
స్వాగతాంజలిచెల్లు సాంప్రతాన
కౌగిలింతల స్వామి గౌరవాస్పదు డెట్లు
వివరంబు తెల్పగా విశద మగును
ప్రణవమంత్రజపము పాలకులభజన
ఏరీతి చెల్లనో యెరుగ నైతి
తత్త్వార్థ చింతన తాత్సార పరిచిన
యతివరేణ్యుల యత్న మేమీ
తుర్యాశ్రమంబున తుళ్ళింత పడుటేమి
నియమాల నిష్టల నియతి మరచి
తలలు బోడి గాని తత్త్వంబు యిసుమంత
బోధ పడలేని బాధ లేదె
కానిపనుల చూచు కాలమొచ్చెననచు
బాధ పడుట మిగిలె మాకు నింక
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి