ఖగరాజవాహన

ఖగరాజు వాహనా కరుణింప రావయ్య
కరిరాజు కరుణించి కాచినట్లు
వైనతేయుపయిన వైళంబు రావయ్యా
భక్తజనులకింక భద్ర మొసగ
అండజ వాహనా! యరుదెంతు వీవయ్య
వేల్పులు రక్షింప వేడగానె
పన్నగవైరిపై పయనించి రావయ్య!
ప్రహ్లాద మొసగంగ భక్త తతికి
ఆ.వె.పన్నగేంద్రు డంత పర్యంక మగుటెల్ల
విష్ణు లీల యనుచు విదిత మాయె
విశ్వ మయుడు నీవు విశ్వంబు నీవంచు
ఎరిగి నట్టి వారి యెరుక గొప్ప
(రచన:- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత