ఆదిత్యాను బంధమ్ము
నీదు కిరణములచేత నిఖిల జగతినంత
నిదురలేపగలగు నిపుణ మతివి
అరుదైన యరదంబు నద్భుతంబొప్పగా
ఏడుగుఱ్ఱాలతో యేగినావు
నిఖిలజగతికంత నెచ్చెలి వీవయ్య
నీవులేక జగతి నిలువ లేదు
వరవృష్టి కురిపింప వడగాలి విసరగా
నీకెసాధ్యపడును నిజముగాను
ఆ.వే.తోడునీడనిచ్చి తోడ్పాటు నందించి
బ్రతుకు భయము బాపి పథము జూపు
నిన్నె నమ్మి నాము నిక్క మిదియె
ఆప్తమిత్రుడట్లునాదుకొనుము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి