మదిలోని మాట

మదిలోని మాట:---
విద్వాన్ ప్రథమ సంవత్సరం (తిరుపతి ప్రాచ్య కళాశాల) లో  చదువుకొనే సమయంలో సంస్కృతం(subsidery)  పాఠ్యాంశాలుగా రఘువంశం(,మొదటి మూడుసర్గలూ)గద్య భాగంగా దశకుమార చరిత్ర(పూర్తి) పింగళి లక్ష్మీకాంతం గారి కుమార వ్యాకరణం మొదులైన గ్రంధాలు చదువుకొనే వారం.
రఘువంశం మాకు కుప్పుస్వామి పిళ్ళె బోధించేవారు. ఒకొక్క శ్లోకం మూడుసార్లు చదివి లఘవుగా అర్థ వివరణ చేసేవారు.
 అంతకుముందే పలు సాహిత్యోపన్యాసాలు మా పాఠశాలలో జరిగేవి ఉద్దండులైన పండితులు వచ్చేవారు.స్వయంగా మానాన్న సంస్కృత పండితులు కాబట్టి శృత పాండిత్యం కొద్దిగా వుండేది.
"ఉపమా కాళిదాసస్య భారవేరర్థ గౌరవం
దండినః పదలాలిత్యం మాఘేసంతి స్త్రయో గుణాః" అని వినివున్నాను.
ఉపమాలంకారంలోకాళిదాసకు సమ ఉజ్జీలేడు అన్నది  జగమెరిగిన సత్యం.
అలాంటి కాళిదాసు,కవికులతిలకుడైన కాళిదాసు రఘువంశ కావ్యంలో తనను మిక్కిలి తక్కువ చేసుకోవడం నాకు నచ్చలేదు. ఎందుకు ఇలా కాళిదాసు రాశాడా అనిపించింది."క్వసూర్యవంశప్రభవో క్వచాల్పమతిః " అన్న శ్లోకంలో  సూర్యవంశరాజుల గొప్పదనాన్ని విని వర్ణించడానికి  కావ్యంగా రాయడం పూనుకోవడం దుడుకుతనడంతో పూనుకోవడం నాటు పడవతో  దుస్తరమైన సముద్రాన్ని దాటి యత్నించడంలా వుందని పేర్కోన్నాడు.
అంతేకాదు
"మందఃకవియశః ప్రాప్తి గమిష్యామపహాస్యతాం
ప్రాంశులభ్యే ఫలేలోభాత్ ఉద్భాహురివవామనః" -
ముందుడైన నేను కవులయోక్క గొప్పదనం కోరుకోవడం ఎలావుందంటే పెద్దపొడువుచేతులవాడు చెట్టుపై నున్న పండ్లను అందుకోవడానికి పొట్టి వాడు ప్రయత్నించడం లా వుందని ఉపమాలంకారం వాడాడు.
 రఘువంశం ,కుమారసంభవం,మేఘసందేశం అనే మహాశ్రవ్య కావ్యాలను, అభిజ్ఞాన శాకుంతలం,విక్రమోర్వశీయం,మాళివాకాగ్ని మిత్రం లాంటి దృశ్యకావ్యాలను  వంటి చేత్తో వ్రాసిన కాళిదాసు ఇలా బేలగా రాయడం మనసుకు కష్టమేసింది. మూర్తీ భవించిన వినయంగా అధికవి వాల్మీకి మ్రోలనిలిచాడు కదా! కాళిదాసు.
మాఅమ్మ రామలక్షమ్మ నాతో బాల్యంలో బాలా రామాయణం(సంక్షేప రామాయణం) వల్లె వేయించేది.అప్పుడు నేర్చుకొన్న శ్లోకాలు నాకు స్పురణకొచ్చాయి. 
శ్రీరామచంద్రుని గుణగణాలనుగురించి నారదమహర్షి వాల్మీకి మహర్షికి వివరిస్తూ,
 రెండు గొప్ప ఉపమానాలు వాడారు.
ఒకటి సముద్రైవ గాంభీర్యః ధైర్యేణ హిమవానివా "అని అనడం లో రామచంద్రుని మూర్తిమత్వం మనకళ్ళముందు ప్రత్యక్షమవుతుంది.  ఉత్తుంగ తరంగాలతో మిక్కిలినేని లోతైన సముద్రం లా రాముడు న్నాడు. అతని ఆలోచనలు ఎవరీకీ అంతుబట్టవు.ఏ వశిష్ట  విశ్వామిత్రులో,హనమంతుడో రాముని ఆలోచనలను చదువగలరు. 
ఇక ధైర్యంతో హిమవంత్పర్వంతం లానున్నాడు రాఘవుడు,.మిగిలిన దేవదానవమానవులందరూ అతని ముందు పిపిలికా సములేకదా! యుద్ధంలో రామచంద్రునితో చావుదెబ్బలు తిని ప్రాణవశిష్టుడైన  రావణాసురుని దయతలచి వదిలి" ఈరోజు యుద్ధంలో అలసిపోయావు.విశ్రాంతి తీసుకొని రేపు తిరిగి యుద్ధానికి రమ్మని అనగలిగిన గుండెనిబ్బరం రామునికే వుంది. శౌర్యపరాక్రమాలతో పాటు రాముడు సర్వసత్వమనోహరుడు అందుకే  రాముడు పుంసాంమోహన రూపుడు, (చంద్రునివలె) సోమవత్ ప్రియదర్శనుడు రాఘవుడు.
మొత్తం రామాయణమంతా సీతమ్మ పైనే ఆధారపడివుంది. రామాయణానికి మరోపేరు 
సీతాయాశ్చరితం మహత్ అనివుంది.దానిని కూడా వాల్మీకి మహర్షి 
జనకస్య కూలేజాతా దైవమాయేవ నిర్మితః
 వాల్మికి మహర్షి సీతమ్మ మాహాత్య్యాన్ని సూచ్యార్థ సూచనగా ఈ దైవమాయేవ నిర్మితః అనే ఉనమాలంకారం వాడారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత