ఆదిశంకరులు- అవతారపురుషులు
ఆదిశంకరుడంతయవనికేతేంచగా
అద్వైత తత్త్వంబు నందినాము
తర్కంపు మార్గాన తనవాద మంతయు
వేదోక్త మార్గాన వెల్ల డించె
అద్వైత మూర్తియౌ నాదిశంకరుడంత
ఆర్యాంబ గర్భాన అవతరించె
శివగురువుజనకుడై శివమూర్తి తానయై
ధర్మాన్ని స్థాపించ తరలివచ్చె
కాలాడిగ్రామమే కైలాస శిఖరమై
కలికల్మషంబును కడిగివేసె
కరుణాంతరంగుడై కమలాలయనువేడి
కనకధార కురిపించె కరుణ తోడ
వేదోక్త ధర్మాన్ని. వేదాంత త్త్వాన్ని
విశ్వాని కంతను విశద పరిచె
ఆరుమతములంచు నారడిపడకుండ
షణ్మతములనెల్ల సఖ్యపరిచె
సౌందర్య లహరితో శారదమ్మనువేడి
భాష్యత్రయముతోన భావమచ్చి
నాల్గువేద ములకు నాల్గుపీఠములను
భరతవర్ష మందు భద్రఫరచి
ఆది శంకరుండు అద్వైత మూర్తికి
వేనవేల నతుల వేడు కొనగ
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి
ఆర్యాంబ శివగుర్వు యందాల బిడ్డడు
కాలటి గ్రామాన కాలుమోపె
వేదాలు శాస్త్రాలు వేటినీ వదలక
గర్భాష్టమంబున గరచె నతడు
కరుణాంత రంగుడు కారుణ్య దృష్టితో
కనకధారనొసగి కలిమి నిచ్చె
పూర్ణాంత రంగుడు పూర్ణాస్రవంతిని
దారి మార్చి నాడు తల్లికొరకు
వేద ధర్మమంత వేద్యంబు సేయగా
దీక్ష పూని నట్టి ధీరుడతడు
వేదతత్త్వమునంత వేద్యంబుసేయగ
వెడలి నాడు వాడు వేదమయుడు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి).
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి