దక్షిణా మూర్తి

దాక్షిణ్య మూర్తియౌ దక్షిణా మూర్తీయే
జ్ఞానాంజ నము నంత  జగితి కొసగె
సనకాది మౌనింద్రు సంసేవ్యు మానుడై
అద్వైత తత్త్వంబవనికొసగె
యువకుడౌ గురువుండ వృధ్ధులౌ శిష్యులు
గురువంత మౌనంపు కుదురు కాగ
శిష్యాళి మౌనమ్ము స్వీకరించిరిచాల
మనసులో శంకలు మాయ మాయె
అఖిలజగతి యంత నద్దమందు కన్నట్లు
ఆంతరాత్మవెలయు నఖిల జగతి
బ్రహ్మమ్ము సత్యము పరమార్థ మిదియేను
ఆ.వే.తెలిసి కొన్న వారు తెలివిమంతులనుచు
ఎరుక నట్టివారె యోగ్యు లయ్య
శృతులు తెలుపు సూనృతంబరయగా
మోద మంద గలరు మోక్ష మంది
(రచన :-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
దక్షిణా మూర్తియై దయనుచూపుగురువు
వటతర్వు మూలాన వాసముండ
గురువేమొ మౌనాన కూర్చుండి వివరించ
వృధ్ధులౌ శిష్యులు విస్మయం బొసగ
సంశంబులన్నియు సమిసెనిటుల
అనునుచువెరగందెనఖిలవిశ్వంబంత
విశ్వంబునద్ధాన విదితమౌపురమట్లు
మాయచే మనకిట్లు మరులుగొల్పు
తత్త్వంబు సర్వంబు తనలోన దాగుంది
అనుచుతెలిపెనేమో యఖిలాంత రాత్ముడు
యోగంబు క్షేమంబు యోగీశ్వరునిలీల
మోదంబు తానంత మోక్ష సిద్ధి
ఆ.వె.ఆశ్రయించవలయునఖిలాంతరాత్ముని
శరణకోర వలయు మనము శ్రధ్ధతోడ
(రచన:--విద్వాన్ గొల్లాపిన్నినాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత