నవగ్రహ స్తుతి
అబ్జబంధువొసగునారోగ్యభాగ్యమ్ము
సకలసంపలలిచ్చు సోముడింక
భూలాభమొసగును భూమిపుత్రడికను
వాగ్విభూతి
నొసగు భౌముడెపుడు
గురవొసగునెపుడు గుర్వర్థములునీకు
శాత్రవుమర్దించి సమకూర్చుజయమింక
భార్గవుండికనీకు బాగుగాను
ఆచంద్రతారార్క యధ్భుత కీర్తిని
అందించు కేతువు యధికమగను
ఆవె. గ్రహములెల్ల యంబకరుణతోడ
చలనమందుచుండు శక్తి కలిగి
అమ్మతనువుకాదె యాధారభూతమ్ము
నిఖిల జంతుతతికి నియమమింతె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి