శివతాండవం

నటరాజ తానంత తాండవంబాడగా
ధరణీతలంబంత తల్లడిల్లె
గగనాన వున్నట్టి గ్రహతారలెల్లను
క్రక్కదిలిచెదిరె కంపమంది
గిరిజాలవిసురుచె గిరగిరా తిరగుచూ
ఊర్ధ్వలోకాలెల్ల నూగి పోయె
శివతాండవంబంత శ్రేయస్సు కొరకంచు
ప్రమదాదులెల్లరు ప్రమదమంద
ఆ.వె.నర్త నంబు సల్పు నటరాజమూర్తికి
దండమిడగరండి తరలిరండి
సాంబశివుని కింక సాష్టాంగ దండంబు
అర్పణంబు సెయు నదనుదొరకె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత