చతురామ్నాయపీఠములు
సృష్య్టాది నుంచియు సూనృతమౌనట్టి
వేదోక్త ధర్మంబు విదిత పరచ అవనికేతెంచిన యాదిశంకరుడంత
అద్వైత మార్గంబు నవనికొసగె
ఆమ్నాయ పీఠాలు యవనిజనులనెల్ల
ఆదుకొనునటుల నందజేసె
గోవర్ధనాఖ్యతో కోటికాంతులతోటి
ప్రాక్దిశలోతాను పాదుకొల్పె
పశ్చిమ దిశలోన పద్మపాదునకంత
ఆచార్య పీఠమ్ము నందజేసె
శృంగేరి పీఠమ్ము శృతిస్మృతులకెల్ల
ఆధారమౌరీతి యవనికోసగె
బదరికాశ్రమమందు బ్రహ్మాను సంధాన
మందింప నెలకొల్పె మఠమునొకటి
ఆ.వే.భక్త తతకి కిచ్చెభగవద్సోస్త్రచయము
భాష్యరచన చేసె ప్రాజ్గులకెల్లను
ఆదిశంకరులుకు నతడెసాటి
(విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజు శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి