స్వామీ రంగనాథానందలు
1979 వసంవత్సరం నా జీవితంలో ఒక సువర్ణాధ్యాయం. మార్చినెలలో పూజ్యశ్రీ రంగనాథానంద స్వామి వారి ప్రథమ దర్శనం జరిగింది. వారి దర్శనం నా జీవితానికొక మేలిమలుపు.ప్రస్తుత నా జీవితం వారి అనుగ్రహం ఆశీర్వాదాల ఫలితం.నేనునిరుద్యోగిగా
చిరుద్యోగిగా వుంటున్న కాలంనుంచి జీవితానికిపరిపూర్ణ నిచ్చే ఉపాధ్యాయ వృత్తికి ప్రేరణ నొసగినారు.వారు వ్రాసిన ఉత్తరాలు ఇప్పటికీ నావెంటనే వున్నాయి.వారి అవ్యాజకరుణామృతానికి నా అంతరంగమే సాక్షి.నేనక్కడున్న నాఇంటికి అరుదెంచి ఆశీర్వదించారు.నీ కొడుకు పండితపుత్రుడు కాడు పండితుడే అని మా తండ్రిగారితో తేల్చి చెప్పారు. స్వామీ వివేకానందులవారి భావాలను తెలుపమని ఆదేశించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి