సి.పి.బ్రౌన్
వేమన పద్యాలు వేడ్కతో చదివేసి
తేనెలొలుగునట్టి తెనుగు తెలిసి
తాటాకు పొత్తాల తానంత తెప్పించి
చదివించి చదివేసి సరిగజేసి
అందమౌరీతిగా యచ్చువేయించగా
పూనుకొనినయట్టి పుణ్యడతడు
కావ్యాల మర్మాలు ఘనమైన ఛందస్సు
అలవోకగాతాను నర్థమెరిగి
ఘనమైన తెలుగును ఖండాంతరాలకు
అరచేతియరటిగానందజేసి
నైఘంటికార్థాల నిర్ణయంబులనెల్ల
విరిచించి రచియించె వివరమొప్ప
ఆ.వె.క్రౌనుకొరత తప్ప బ్రౌనుకేమికొరత
మంచిమనసుగలుగు మాన్యుడతడు
ఆత్మబంధువతడునాంధ్రులకెల్లను
వందనీయుడితడు వాస్తవంగా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి