రాయలేలిన సీమ

రమ్యాతి రమ్యమౌ రాయలేలిన సీమ
రతనాల సీమగా రాణకెెక్కె
తిరుపతి వెంకన్న శ్రీమంతుడతడయ్య
కోరిన వారికి కొంగు పసిడి
శ్రీశైల నాథుండు శిఖరాయమానుడై
భ్రమరాంబతల్లితో బ్రదుకు నిచ్చె
నవనందులానందనవనతీమూర్తులై
భక్తజనులకెల్ల ముక్తినొసగి
ఓయంచు పిల్వగా యోయంచు బదులిచ్చు
నవనారసింహులు నడచిరాగ
విరుపణ్ణ కట్టించె  వీరభద్రునిగుడి
లేపాక్షి బసవండు లేచిరాగ
బుగులు దీర్చు నట్టి బుగ్గ రామేశుండు
చెన్నకేశవు తోడ చెలువు మీర
తాడిపత్రిలోన తనువంత యుప్పొంగ
కనులపండువాయె కాంక్షతీర. 
రచన. విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత