రామనవమి

అందాల రామునియపరూపరూపంబు
అందానికేనిట్లు నంద మోయి
అందాలు చిందించు యరవింద నేత్రాలు
అందాని కేయిచ్చు నంద మంత
ఆజాను భాహని యందమ్మే యందమ్ము
కమనీయ మౌమోము కనుల విందు
మృగరాజ మధ్యంబుహృద్యమౌ గళసీమ
చూచిన వారివే చూడ్కు లయ్య
చిరు నవ్వు చిందించు చిరుదర హాసంబు
తనివార చూచినా తక్కు వోయి
ఆ‌వె.రాము డన్న పిలువ రంజిల్లు హృదయంబు
త్యాగ రాజ మదిని దాగినాడు
శరణుకోరినట్టి శత్రు వైననుతాను
అండనిత్తు ననుచు నాన సేసి
(రచన:--విద్వాన్ గొలపిన్ని నాగరాజ శాస్త్రి)
కౌసల్యతనయుడౌ కోమలగాత్రండు
రావణునిర్జించి లంక గెలచి
సౌమిత్రి సహితుడై శోభనగాత్రుడై
హనుమదాదులగూడి నానందమందించ
అయ్యోధ్యకేతెంచి హర్ష మొసగి
సుగ్రీవసహితుడై సుశ్లోక వృత్తితొ
అభీషేచంనంబంత యందుకొనగ
పట్టాభిషిక్తుడై పాలించె జగమంత
రామరాజ్యమనెడు నామమొప్పె
పాడిపంటలతోడి పండుగల్ మెండాయె
వ్యాధులు బాధల వార్త లేదు
ఆ.వె.ధర్మవర్తనమ్ము దాశరథిరాజ్యాన
అనుసరించినారు నవని జనులు
వేల వత్సరాలు వేల్పురాజ్యమటుల
రాముడేలినట్టి రాజ్యమిదియె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
"రా"జీవనేత్రుడే "మా"జీవమంత్రమ్ము
రామతారకమౌను రామ రక్ష
పరమేశు తత్త్వంబు పరమాత్ము విభవమ్ము
వాగర్థములరీతి వాస్త వమ్ము
మాహేశు నామంబు మాధవు రూపంబు
మదిలోని మెరువగా మంగళమ్ము
భుజగశయనుకొల్చి భుజగభూషణు మ్రొక్కి
అతిశయానందమ్ము నందుకొందు
ఆ.వె.ఎన్నిజన్మ లేగె యీజన్మలభియించె
ఆదుకొందువనుచు నాశకలదు
దారిచూపు వాడు దామోదరుండంచు
మదిని నమ్మినాను మరువకెపుడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
అందాల రామునియపరూపరూపంబు
అందానికేనిట్లు నంద మోయి
అందాలు చిందించు యరవింద నేత్రాలు
అందాని కేయిచ్చు నంద మంత
ఆజాను భాహని యందమ్మే యందమ్ము
కమనీయ మౌమోము కనుల విందు
మృగరాజ మధ్యంబుహృద్యమౌ గళసీమ
చూచిన వారివే చూడ్కు లయ్య
చిరు నవ్వు చిందించు చిరుదర హాసంబు
తనివార చూచినా తక్కు వోయి
ఆ‌వె.రాము డన్న పిలువ రంజిల్లు హృదయంబు
త్యాగ రాజ మదిని దాగినాడు
శరణుకోరినట్టి శత్రు వైననుతాను
అండనిత్తు ననుచు నాన సేసి
(రచన:--విద్వాన్ గొలపిన్ని నాగరాజ శాస్త్రి)

అందాల రామునియపరూపరూపంబు
అందానికేనిట్లు నంద మోయి
అందాలు చిందించు యరవింద నేత్రాలు
అందాని కేయిచ్చు నంద మంత
ఆజాను భాహని యందమ్మే యందమ్ము
కమనీయ మౌమోము కనుల విందు
మృగరాజ మధ్యంబుహృద్యమౌ గళసీమ
చూచిన వారివే చూడ్కు లయ్య
చిరు నవ్వు చిందించు చిరుదర హాసంబు
తనివార చూచినా తక్కు వోయి
ఆ‌వె.రాము డన్న పిలువ రంజిల్లు హృదయంబు
త్యాగ రాజ మదిని దాగినాడు
శరణుకోరినట్టి శత్రు వైననుతాను
అండనిత్తు ననుచు నాన సేసి
(రచన:--విద్వాన్ గొలపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత