నీలోనా నాలోన
నీలోనే నాలోని నిలనైన కలనైన
నీశుగా నిలిచేవు నిజము నిజము
అచటంచు నిటతంచు నంతటా వెదికినా
అంతేమి చిక్కవు యసలు. నీవు
మనసుకేయందవు మాటకే చిక్కవు
మాయలోముంచేటి మాయవీవు
ఓర్పుతో వెదకినానేర్పుతో మెలగిన
మౌనంగ యడగిన మౌన మేల?
శిల్పాన చిత్రాన చిన్మూర్తిగానిల్చి
అర్చావతారమై యలరినావు
సాకార రూపాన సాన్నిధ్యమొసగినా
నిర్గుణ తత్త్వ మై నిలిచియున్న
వైరాగ్య భావమో వైరాను బంధమో
భవబంధములదీర్చు బంధువయ్య
ఆ.వె
.అనుచు తలతునేను నహరమ్మాత్మలో
వేరుదారియింక వెదుకలేను
రాజమర్గమిదియె రమ్మంచు తెలిపిరి
వేదవేద్యుకొలుతు విధిగా నేను
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి