పుడమితల్లి కినుక
పుడమికినుకబూన పుట్టిముణుగునంచు
తెలుసుకొనుడునేడు తెలివి కల్గి
ధాత్రియొసగెమీకు ధాన్యాధికములెల్ల
సుజలాల నెల్లను సుమధరమౌరీతి
వసుధయెసగెమీకు వజ్రాలగనులతో
ఖనిజసంపదలతో కలిమినొసగి
అమృతధారలతోడనాప్యాయమొనగూర్చు
దివిజాపగలనెల్ల దీనపరచి
అభివృద్ధి పేరుతో నాటలాడుటలెల్ల
తానుకూర్చన్నకొమ్మ తాను నరుకు
వైఖరాయెయకట వింతగాను
ఆ.వె.వంటచెరకు కొరకు వనమెల్ల నరికిన
వనము చిన్న బోవు వగపు మిగులు
ఆత్మనాశనమ్ము నవివేకమగునోయి
బుధ్ధి తెచ్చుకొన్న పుడమి నీదె
(నాగరాజ మాట నమ్ము వలెను)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి