మానవుడు -ప్రకృతి

మంజులమైనట్టి  మనుజలోకంబు
మరుభూమి గా మార్చెను మానవుండు
భూమియె మాదంచు బూకరించు నరుడు
సర్వజీవులనెల్ల సంహరించి
వికటాట్టహాసంబు వికృతమౌరీతి
చేయగా జాలిన చెనటి వాడు
కడలినంతనరుడు కాలుష్య భరితమ్ము
కావించి చెడగొట్టు కఠిను డతడు
కాన లన్ని నేడు కాలుష్య భవనాలు
వృక్ష సమితి  యంత వుసురు తీసె
సహజ వనురు లన్ని సర్వంబు ధ్వంసమ్ము
నరక లోక మాయె నరుని బ్రతుకు
[రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి]

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత