సీతారామ కళ్యాణము
సిగ్గుల మొగ్గయౌ సీతమ్మ తల్లియె
కళ్యాణ శోభతో కదలివచ్చె
అందాలు చిందించు నయోధ్య రామయ్య
దరహాస వదనుడై తరలివచ్చె(రాగ)
ఆకాశమాయెగా హరివిల్లు పందిరి
పుడిమియం తయుమారె విడిది యిల్లు
దశరథుండంతట నగుమోము చిందించు
పున్నెంపు.మొలకయౌ పుత్రుజూచి
కౌసల్య మాతయె కళ్యాణ తిలకంబు
తీరుగా నుదుటను తీర్చి దిద్దె
రాములోరి పెళ్ళి రారండి మీరంత
కనుల పండువగును కాంచినంత
జన్మధన్యమగును జన్మంబు లేదింక
మాట యిచ్చినాము మరువ కండి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి