ఏడుగుర్రాల తేరు

ఏడుగుఱ్ఱముల తేరు యెక్కియేగుచునుండు
ఆదియంతమలనుయవధిలేదు
తూర్పుకొండలనుండినోర్పుతో బయలెళ్ళి
పడమటి కొండల ప్రాకు నెపుడు
ఒంటిచక్రపుతేరు ఓర్పుతో తోలెటి
 తొడలులేనియనూరు తోడు గాను
పగలురాత్రులనుచు పనులేల్ల పంచేవు
పాడిపంటల తోడ పంచి పంచి
 ఆ.వే.దండ మిడిన చాలు దయతోడ నిత్తువు
సిరుల నెల్ల నీవు తిరము గాను
జబ్బు గిబ్బు లెల్ల ఝాజించి వైతువు
వంద నమ్ము యనిన వరములిచ్చి
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత