మానవ మనస్తత్వం
మంచితనముచూప మాంధాత కాలమ్ము
వాడయ్య వీడంచు వదురు చుంద్రు
తెలివితేటలుచూప తెంపరివీడంచు
నయవంచ కుండగా నామ మిత్రు
పరులనాదుకొనిన పరమ మందమతిగ
పరిగణింత్రుజనులు ప్రబల రీతి
శాస్త్రదృష్టిగలుగ చాదస్తు డనుచును
చులకన చేయగా చూతురెపుడు
సత్ప్రవర్తనకల్గ సత్రకాయనుచును
ఆటపట్టింతురు నాధునికలు
వాగ్ధాటి చూపిన వదురుబోతుయనుచు
వంకబెట్టుటెపుడు వాస్తవంబు
మౌననియతిపూన మూడజనుడనుచు
ఎగతాలి చేయగా వేచి వుంద్రు
దరహాస మొనరింప తమ్ము పరిహసించె
ననుచుంద్రు లోకాన నరులు తలపు
ఆ<వే,కలియుగము నందు కలుషవర్తనలంత
వేచియుందు రకట వేడ్కతోన
తప్పులెన్ను గుణము తామసంబనుచును
తలచరెపుడు కూడ కలనునైన
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి