కాననము-'కైవల్యము
కానని భూమియే కైవల్యసదనమ్ము
ఆచార్యపీఠంగ నమరె వనము
ఆచార్యుసేవలోనాధ్యత్మ విద్యను
గ్రహించిశిష్యండు జ్ఞానియగును
ఆద్యంతముల్లేని యధ్యాత్మ విద్యను
అందించి నారయ్య యాశ్రమాన
మంత్రమ్ము దర్శించి మౌనీంద్రు లందరూ
విశ్వాని కిచ్చిరి వేదరాశి
నిగమశిఖలతోడ నిగమైక వేద్యుని
ధ్యానంబు చేసిరి ధ్యాసపెట్టి
బాదరాయణుడంత బ్రహ్మ సూత్రుదులెల్ల
సంతరించెనుకాదె సాంద్ర కరుణ
తే.గి.విశ్వ కళ్యాణ శీలురై వెలసి నట్టి
పరమ రుషులెల్ల కానల పరిగి నారు
అంతె వాసులు నధికమౌ భక్తితోడ
చదువు నేర్చిరి వారంత చక్కగాను
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి