అమ్మా -నాన్నలు
వంశపారం పర్యంగా వచ్చే ఆస్తిపాస్తులు కన్నా,వారినుంచి క్రమానుగతంగా లభించే సంస్కృతీ సంప్రదాయాలే అమూల్యమైన ఆస్తి.అవి మనలను సంస్కార వంతులుగా చేసి విశిష్ట వ్యక్తిత్వాన్ని అందిస్తాయి.
మా అమ్మ రామలక్ష్మమ్మ బాల్యంలో నేర్పించిన బాలరామాయణం నాకు ప్రేరణా దాయకంగా నిలిచింది. ఆతరువాత దానిని నేను నా విద్యార్థి లోకానికి అందించాను. శ్రీరాముడు లలితా పరమేశ్వరీ వేరు రూపాలు కారు ,వారు ఒకరే అని ఘంటాపథంగా అమ్మ చెప్పింది, ఆతరువాతి కాలంలో ఇదే విషయాన్ని లక్ష్మణయతీంద్రులు,గరికపాటివారు బలపరిచారు. ఖడ్గమాల మంత్రాన్ని నేర్పారు.
ఇక మా తండ్రిగారు నడిచే విజ్ఞాన సర్వస్వం, వారు వేకువనే 4గం||లకే మేల్కొని ఆదిశంకరుల స్తోత్రాలు,గజేంద్ర మోక్షము, భీష్మస్తవరాజము,గోపికా గీతలు సుశ్రావ్యంగా పఠించేవారు. అప్పటినుంచి,పోతన అన్న ఆంధ్రమహాభాగవతమన్న అత్యంత యిష్టము.వారు ప్రత్యేకించి నాకు పాఠాలు చెప్పడం తక్కువైనా పండితులతోగాని,అనుయాయులతో గానీ చర్చనీయాంశాలనుచర్చించే సందర్భములో ఎన్నో విషయాలు నేర్చుకొన్నాను.అలా దాదాపు ఇది శృత పాండిత్యం గా సంక్రమించింది.ఇదంతా నా జనినీ జనకుల భిక్షే. మా తండ్రిగారు తైత్తిరీయోపనిషత్తు శిక్షా వల్లీ,భృగవల్లీ,ఆనందవల్లీ వారు పఠిస్తుంటె అలౌకికమైన ఆనందాను భూతి కలిగేది."అహమన్నమహమన్నం అన్నాదోహ మన్నాదోహ"అనే రుక్కు ఇప్పటికీ గుర్తే
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి