నవభారత పాఠశాల గతస్మృతి

గతమంతకదలాడె కనులముందునాకు
అక్షరాలసదనమక్షయంబు
చదువు లమ్మగు డిని చదవునేర్పగలగు
బాధ్యతనెరపిన భాగ్యశాలి
స్వాధ్యాయమొనరించి సాకల్యమౌరీతి
పాఠంబుబోధించు బాణి నెరిగి
ఛాత్రలకెప్పుడు చక్కగా నేర్పించు
అవకాశమక్కడ యమరెనాకు
సూక్తిసుధల గ్రోలి సుక్షితమౌరితి
భావిపౌరులయిరి భవ్యరీతి
పద్యపఠనమందు ప్రాగల్భ్యమొప్పగా
తెలుగుతీపినెరుగ తెన్నుయిదియె
నవనవోన్మేషమౌ నటనాభినయమంత
పుణికిపుచ్చుకొనిరి బుధ్ధి కలిగి
ఆ.వె.విలువగలిగినట్టి విద్యనందించెడి
భాగ్యలభ్ధికలగె భాగ్యవశత
ఎన్నిజన్మలందుయేర్పడ్డ బంధమొ
ఇచటయిపుడుకల్గె యింపుగూర్చి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్నినాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత