అంతర్జాతీయ మహిళా దినోత్సవం

బతుకమ్మ పండుగ బ్రహ్మండమైయుండ
వనితాదినోత్సవ వైనమేల
ఆషాడమాసాన యమ్మొరు సేవించి
బోనాలనర్పించు భొగముండ
శ్రావణమాసాన సర్వసంపదలిచ్చు
వరలక్ష్మి వ్రతమంత వరములొసగు
భౌమవారమునందు భవ్యమౌరీతిగా
గౌరమ్మ పూజించు ఘనతకలుగ
మహిళాదినమనుచు మాన్యతేల
సమ్మక్క సారలమ్మ సామర్థ్యం మొన్న గా
పోరుసల్పిరికాదె పుడమిపైన
పాశ్చాత్య దేశాల పడతులనెప్పుడు
మగవారు మన్నించ మాన్యతంత
వట్టినాటకమోయి కట్టుకథయె
ఆ.వె.పొరుగువారియింట పుల్లకూరకొరకు
అంగలార్చదగునె యతిగమనము
శక్తికెపుడు వనిత సాదృశ్యమన్నట్టి
ఆగమంబులెల్లయభిలషించె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్నినాగరాజ శాస్త్రి)
సమ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత