భస్మానులిప్తాంగుడు
భస్మానులిప్తాంగ !భస్మమే స్నానమై
అధ్భుతంబౌరీతి అమరెనీకు
భస్మాంత దేహాన భస్మమే మిగులుగా
భ్రమలతో బ్రతుకెల భద్రమంచు
సందేశ మివ్వగా సాగినావొ
కాళేశ్వరుండవై కాలస్వరూపుడై
కారుణ్య మూర్తివై కదలినావొ
శివుడవై హరుడవై భవుడవై
నిత్యమై సత్యమై నిలిచినావు
గరళమంత నీవు కంఠాన నిలిపేసి
అమృత మంత మాకు నప్పగించి
మంచుకొండ పైన మౌనముద్రనుపూని
ధ్యాని యైతివీవు ధ్యాస యోదొ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి